కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరంపేట మైనారిటీ బాయ్స్ హాస్టల్‌లో దారుణం జరిగింది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిపై లైంగిక దాడి జరిగింది. అదే హాస్టల్‌లో ఉంటున్న ముగ్గురు మైనర్ బాలురే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. తన కుమారుడిపై జరిగిన ఈ దారుణం గురించి తెలుసుకున్న బాధితుడి తండ్రి గుండె పగిలిపోయింది. వెంటనే ఆయన దుండిగల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రంగంలోకి దిగి అన్ని కోణాల్లోనూ ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితుడు చిన్నారి కావడంతో ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నారు. నిందితులు కూడా మైనర్లు కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో భద్రత లోపించడం, వార్డెన్ల పర్యవేక్షణ కొరవడడంపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
